కలువాయి పోలీసుస్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణకాంత్
ఎస్పీ సడెన్ విజిట్…
- కలువాయి పోలీసుస్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు జిల్లా కలువాయి పోలీసుస్టేషన్‌ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు, సలహాలు చేశారు. పెండింగ్ కేసుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సీఐ, ఎస్ఐలు ఉన్నారు.