పోషణ్‌ భీ .. పఢాయి భీ

వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు

పోషన్ బీ..
పఢాయి బీ..!!
వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు.

ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు జడ్పీ ఉన్నత బాలుర హైస్కూల్ ప్రాంగణంలో అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వ‌హిస్తున్నారు. సీడీపీఓ పద్మజ కుమారి ఆధ్వ‌ర్యంలో.. మూడురోజుల‌పాటు ఈ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ బీ పడాయి బీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరి సమగ్ర అభివృద్ధికి అందరు సహాయ సహకారాలు అందించాలని.. మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో అంగన్వాడి విద్య నాణ్యత ప్రమాణాలతో నిర్వహిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోషణతో పాటు అంగన్వాడీ వర్కర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, అంగన్వాడిని ఉన్నత నాణ్యత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లలలోనే సామాజిక,భౌతిక, సాంస్కృతిక, కళాత్మక, భాష, అక్షరాస్యతతోపాటు సంఖ్యాశాస్త్రం వంటి అంశాలతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికల రూపొందించి అంగన్వాడి వర్కర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *