నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వక్తృత్వపు పోటీలు నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం…
- నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వక్తృత్వపు పోటీలు నిర్వహణ
- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
సమాజంలోని మహిళలో ఆత్మస్థైర్యాన్ని, మహిళల శక్తిని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన ధ్యేయమని… నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని..జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు… డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళల భద్రత, వేధింపులు, ఆత్మరక్షణ అనే ఐదు అంశాలపై విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థినీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సీనియర్ లెక్చర్స్ వ్యవహరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సింధుప్రియ మీడియాతో మాట్లాడారు. మహిళా సమస్యల పరిష్కారానికి విద్యార్ధుల ఆలోచనలు, వారి నైపుణ్యం వెలికితీయడానికి వక్తృత్వ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. CH. సౌజన్య , ఉమెన్ PS CI సుబ్బారావు , DTC CI నాగేశ్వరమ్మ, RI వెల్ఫేర్ రాజారావు, పలు పాఠశాల, కళాశాలల విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.