కోవూరులో ట్రైనీ డీఎస్పీ, ఎస్ఐ వాహనాల తనిఖీ
హెల్మెట్ ధరించకపోతే ఫైనే
- కోవూరులో ట్రైనీ డీఎస్పీ, ఎస్ఐ వాహనాల తనిఖీ
నెల్లూరు జిల్లా… కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్లో ట్రైని డిఎస్పి శివ ప్రియ సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేశారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేసి పలు వాహనాలకు ఫైన్ లు వేశారు. కొన్ని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ర్యాస్ డ్రైవింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఆయన హెచ్చరించారు.