కూట‌మి చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌న‌మే బ‌డ్జెట్‌

జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వకర్త బొబ్బేపల్లి

ఎన్నికలలో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బడ్జెట్ విడుదల పై అయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ… ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు. ప్రణాళిక బద్ధంగా రూపొందించిన బడ్జెట్ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *