చిల్డ్రన్స్ పార్క్ వద్ద విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ లో ఘనంగా సైన్స్‌డే
వివిధ సైన్స్ ప్రాజెక్టులు, నమూనాల ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు
నాటి విద్యార్థులే…నేటి శాస్త్రవేత్తలు
- చిల్డ్రన్స్ పార్క్ వద్ద విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ లో ఘనంగా సైన్స్‌డే
- వివిధ సైన్స్ ప్రాజెక్టులు, నమూనాల ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు
నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్కు వద్ద ఉన్న విశ్వసాయి SRK స్కూల్లో జాతీయ సైన్స్ డే ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలు అందరినీ అబ్బురపరిచాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సైన్సు ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ కృష్ణమోహన్ లు అభినందనలు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ యాని మీడియాతో మాట్లాడుతూ…విద్యార్థులందరూ సైన్స్ పట్ల అవగాహన అవసరమన్నారు. నేడు విద్యార్థులే రేపటి సైంటిస్టులు అన్నారు. అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డీన్ రఘురామ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు