నాన్న కల… తనయ గురి

కావలిలో క్రికెట్ బ్యాట్ ఝళిపిస్తున్న అక్షయ సిద్దార్థ్

అండర్ 12 విభాగం క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ప్రతిభ

నిత్యం కఠోర సాధన… ఆటలో మేటిగా రాణింపు

ఇండియా మహిళాటీంలో ఆడాలన్నదే లక్ష్యం.. ఆ దిశగా అడుగులు.

నాన్న కల… తనయ గురి

  • కావలిలో క్రికెట్ బ్యాట్ ఝళిపిస్తున్న అక్షయ సిద్దార్థ్
  • అండర్ 12 విభాగం క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ప్రతిభ
  • నిత్యం కఠోర సాధన… ఆటలో మేటిగా రాణింపు
  • ఇండియా మహిళాటీంలో ఆడాలన్నదే లక్ష్యం.. ఆ దిశగా అడుగులు.

అనగ న‌నగ రాగ మతిశయిల్లుచునుండు.. తినగ తినగ వేము తియ్యగనుండు…సాధనమున పనులు సమకూరు ధరలోన… విశ్వదాభిరామ వినురవేమ.. అనుకున్న లక్ష్యం వైపు గురిపెట్టి ఆ దిశగా నిత్యం సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధిస్తామని మన వేమన పద్యం భావం. ఈ పద్యంలో సాధనమున పనులు సమకూర ధరలోన…అనే అర్థానికి అద్దంపడుతుంది అక్షయ సిద్దార్థ్ అనే బాలిక. తన ఐదేళ్లనాటే ఎంచుకున్న క్రికెట్ క్రీడలో నిత్యం సాధన చేస్తూ తన లక్ష్యం దిశగా వడి వడిగా అడుగులు వేస్తుంది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో చిచ్చర పిడుగులా ఆల్ రౌండర్ ప్రతిభను చాటుతుంది. పిట్ట కొంచం కూత ఘనం అన్నట్లు ఇటు ఆటలోనూ, అటూ చదువులోనూ భళా బాలిక అనిపించుకుంటున్న అక్షయ సిద్దార్థ్ ఎవరు..? క్రికెట్ పై ఎలా మక్కువ పెంచుకుంది..? ఆటలో ఎలా సాధన చేస్తుంది..? తన అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ ద‌ ఎన్ త్రీ న్యూస్ …!

నెల్లూరు జిల్లా కావలి పట్టణం రామ్మూర్తిపేటలో నివాసం ఉంటున్న వెంకట సిద్దార్థ్ అలియాస్ జనసేన యువనాయకుడు సిద్ధు కుమార్తె అక్షయ సిద్దార్థ్. ఐదో తరగతి చదువుతోంది. తండ్రి సిద్ధుకు స్పోడ్స్ అంటే ఎంతో మక్కువ. కానీ అతను అందులో రాణించలేకపోయాడు. తన కుమార్తె ను అయినా క్రీడల్లో రాణించేలా చూడాలని తలంచాడు. తనకు ఇష్టమైన క్రికెట్ వైపు అక్షయ సిద్దార్థ్ ను ప్రోత్సహించాడు. ఇలా అక్షయ సిద్దార్థ్ తన ఐదో ఏటనే క్రికెట్ బ్యాట్ పట్టింది. తొలుత తండ్రి సిద్దునే గురువుగా నిత్యం సాధన చేస్తూ ఆటలో మెళుకువలు నేర్చుకుంటూ ఆటలో మంచి పట్టు సాధించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడుతుంది. జట్టులో సెకండ్ డౌన్ లో దిగి ఎంత మెరుపు వేగంతో వచ్చే బాల్ నైనా అంతే వేగంతో తన బ్యాట్ ను ఘుళిపిస్తూ చక్కని షాట్ లు కొడుతుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ విక్కెట్స్ నూ టపా టపా పడగొట్టేస్తుంది. ఫీల్డింగ్ లోనూ మైదానంలో చిచ్చరపిడుగే. ఇలా తన ఆల్ రౌండర్ ప్రతిభను చాటుకుంటుంది. అండర్ 15 విభాగంలో ఇప్పటివరకు హైదారాబాద్, గుంటూరు, తిరుపతి, నెల్లూరు లో పోటీల్లో పాల్గొని జట్టు విజయాల్లో కీలకంగా మారింది. క్రికెట్ లో ఇండియా మహిళా టీంలో స్మితి మందాన, విదేశీ జట్లల్లో ఆస్ట్రేలియా జట్టులోని ఎలిసా పెర్రీ అంటే ఇష్టమని అక్షయ సిద్దార్థ్ చెబుతుంది. తండ్రి సిద్దు ప్రోత్సాహంతో నిత్యం సాధన చేస్తున్నట్లు, అదేవిధంగా బాగా చదువుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం క్రికెట్ కోచ్ రాజశేఖర్ నుంచి ఆటలో మెళుకువలు నేర్చుకుంతున్నట్లు, ఎప్పటికైనా మహిళా ఇండియా జట్టులో ఆడాలన్నదే తన లక్ష్యమంది. ఇలా అక్షయ సిద్దార్థ్ తండ్రి కలను సాకారం చేసేందుకు తన లక్ష్యానికి గురిపెట్టి వడి వడిగా అడుగులు వేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్షయ సిద్దార్థ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *