కన్నుల పండువగా పల్లకీ సేవ
సంగంలో శ్రీ పాలేటి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
వైభవంగా గంగమ్మతల్లి 13వ వార్షికోత్సవం…
- కన్నుల పండువగా పల్లకీ సేవ
- సంగంలో శ్రీ పాలేటి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
నెల్లూరు జిల్లా సంగంలో పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో 13వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు పెట్టుకున్నారు. అనంతరం పల్లకీ సేవను కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామ పుర వీధుల్లో తప్పెట్లు తాళాల మధ్య అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు