లోకేష్ గారు మా ఆవేద‌న మీకు విన‌ప‌డలేదా

92వేల మంది నిరుద్యోగ యువ‌త భ‌విష్య‌త్ మీ చేతిలో

నెల్లూరు క‌లెక్ట‌ర్ ఎదుట గ్రూప్ 2 మెయిన్స్ అభ్య‌ర్థుల నిర‌స‌న‌

లోకేష్ గారు…మా ఆవేద‌న మీకు విన‌ప‌డలేదా…

  • 92వేల మంది నిరుద్యోగ యువ‌త భ‌విష్య‌త్ మీ చేతిలో
  • నెల్లూరు క‌లెక్ట‌ర్ ఎదుట గ్రూప్ 2 మెయిన్స్ అభ్య‌ర్థుల నిర‌స‌న‌

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ గారు…మా ఆవేద‌న మీకు విన‌ప‌డ‌లేదా అంటూ… గ్రూప్ – 2 మెయిన్స్ అభ్య‌ర్థులు సూటిగా ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు వారు నెల్లూరు జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట‌…నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రోస్ట‌ర్ త‌ప్పుల‌ను క్లియ‌ర్ చేసి…గ్రూప్ -2 మెయిన్స్ నిర్వ‌హించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం గ్రూప్ 2 అభ్య‌ర్థులు ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. ఒక నిరుద్యోగుడి క‌ష్టం…ఒక నిరుద్యోగుడికే తెలుస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం, విద్యాశాఖామంత్రి స్పందించి… రోస్ట‌ర్ త‌ప్పుల‌ను క్లియ‌ర్ చేసి…గ్రూప్ -2 మెయిన్స్ నిర్వ‌హించాలని విజ్ఞ‌ప్తి చేశారు. 92వేల మంది నిరుద్యోగ యువ‌త భ‌విష్య‌త్ మీ చేతిలో ఉంద‌న్నారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో గ్రూప్ 2 అభ్య‌ర్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *