ఆ న‌ష్టం కోలుకోలేనిది

గౌత‌మ్ అన్న లేని లోటు తీర‌న‌ది

అలాంటి మంత్రి కావాల‌నే కోరుకుంటారు…

భావోద్వేగానికి గురైన‌ మాజీ మంత్రి మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి

నెల్లూరులోని మేక‌పాటి నివాసంలో దివంగ‌త మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వ‌ర్ధంతి

మేక‌పాటికి నివాళుల‌ర్పించిన మేక‌పాటి కుటంబ స‌భ్యులు, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వైసీపీ శ్రేణులు

ఆ న‌ష్టం…కోలుకోలేనిది….

  • గౌత‌మ్ అన్న లేని లోటు తీర‌న‌ది
  • అలాంటి మంత్రి కావాల‌నే కోరుకుంటారు…
  • భావోద్వేగానికి గురైన‌ మాజీ మంత్రి మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి
  • నెల్లూరులోని మేక‌పాటి నివాసంలో దివంగ‌త మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వ‌ర్ధంతి
  • మేక‌పాటికి నివాళుల‌ర్పించిన మేక‌పాటి కుటంబ స‌భ్యులు, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వైసీపీ శ్రేణులు

గౌత‌మ్ అన్న లేని లోటు తీర‌నద‌ని…ఆ న‌ష్టం నుంచి ఇంకా కోలేకోలేక‌పోతున్నామ‌ని…ఆత్మ‌కూరు మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి మేక‌పాటి విక్రమ్‌రెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు. నెల్లూరులోని మేక‌పాటి నివాసంలో… దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి 3వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, మేక‌పాటి మ‌ణిమంజ‌రి, మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, వైసీపీ శ్రేణులు, మేక‌పాటి అభిమానులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి…మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. రాష్ట్రానికి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న చేసిన సేవ‌ల్ని ఈ సంద‌ర్భంగా వారంద‌రూ గుర్తు చేసుకున్నారు. అనంత‌రం మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకే ఒక్క సంవ‌త్స‌రంలోనే మంత్రిగా రాష్ట్రానికి, జిల్లాకి ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేశార‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టికీ అలాంటి మంత్రే కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *