ప్రైవేట‌ర్స్ వ‌ల్లే… BSNLకి దెబ్బ‌

బీఎస్ఎన్ఎల్‌ని మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

నెల్లూరు ఎంపీ, టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం

కేవ‌లం ప్రైవేట‌ర్స్ వ‌ల్లే…బీఎస్ఎన్ఎల్ సంస్థ న‌ష్టాల్లోకి వెళ్లిపోయింద‌ని… నెల్లూరు ఎంపీ, టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు న‌గ‌రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో…జీఎంలు, స్టాఫ్ తో… ఆయ‌న టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం నిర్వ‌హించారు. ముందుగా వేమిరెడ్డికి జీఎంలు, సిబ్బంది పూల‌బొకే అంద‌చేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌మావేశంలో… బీఎస్ఎన్ఎల్ సంస్థ న‌ష్టాలు, లాభాలు, సెల్ ట‌వ‌ర్స్ పెంపు తదిత‌ర ముఖ్య అంశాల‌ను జీఎంలు, స్టాఫ్‌తో చ‌ర్చించారు. అనంత‌రం చైర్మ‌న్ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. న‌ష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ను 267 కోట్ల రూపాయల ఆదాయంలో నిలప‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. బీఎస్ఎన్ఎల్‌ని మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలని ఆయ‌న కోరారు. మళ్లీ ఆరు నెలల తర్వాత నిర్వహించుకునే ఈ సమావేశం నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ అమరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. టీఏసీ సమావేశం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలువైన సూచనలు, సలహాలు అందించారని, తప్పకుండా వాటిని పాటిస్తామన్నారు. కార్యక్రమంలో టీఏసీ సభ్యులు కటారి రమణయ్య, గుర్రం మాల్యాద్రి, ప్రసాద్‌, బ్రహ్మానందం, రమేష్‌ బాబు, ముంగర గోపాల్‌, అనూష, సురేంద్ర రెడ్డి, డిజిఎం ఎం.శ్రీనివాసరావు, ఐఎఫ్‌ఏ శ్రీనివాసరావు, ఏజీఎం పి.శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *