ప్రమాదకంగా ఎండిన చెట్టుపై ఎందుకు స్పదించడం లేదు
సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికారుల్ని నిలదీసిన నెల్లిపూడి సర్పంచ్
తిరుపతి జిల్లా వాకాడు మండలం ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీ శక్తి భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రమాదకరంగా ఎండిన చెట్టు అని మీడియాలో వచ్చిన కథనంపై ఆర్అండ్ బీ అధికారులు ఎందుకు స్పదించడం లేదని…నెల్లిపూడి సర్పంచ్ సూటిగా ప్రశ్నించారు. పచ్చని చెట్లను కొట్టి అమ్ముతున్నారే కానీ… ప్రమాదకరంగా తయారైన ఎండిన చెట్టును… ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని తెలిసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్ బీ అధికారులు ప్రజల్లో ఉండాలని…కానీ మీరెక్కడ కూడా కనిపించడం లేదని ఆరోపించారు. సర్పంచ్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా….ఆర్అండ్‌బీ అధికారి ఎటువంటి సమాధానం చెప్పలేక మౌన వహించక తప్పలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి…ప్రజలకి ఇబ్బందికరంగా మారిన ఎండిపోయిన చెట్టుని తొలగించాలని కోరారు.