సేవ‌లో ముందుంటాం

మ‌న ఫౌండేష‌న్ చైర్మ‌న్ మ‌న్నేటి

ఉద‌య‌గిరిలో ప‌లువురికి ఆర్ధిక సాయం, ప‌రామ‌ర్శ

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో మన ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి కనిపించిన ప్రతి ఒక్కరిని, ఆత్మీయులను పలకరిస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆర్థిక సహాయం అందించారు. ఏ ఒక్క అవసరం వచ్చిన ఆదుకునేందుకు మన ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించడంలో ఏమాత్రం వెనకాడదని మన్నేటి తెలిపారు. ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి రామారావు కుమార్తె గుండె సమస్యతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆమెకు మన్నేటి తన వంతు సహాయంగా 5000 రూపాయలు అధిక సహాయం అందించారు. కొండాయపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దేవడ్ల రమణయ్య ఆటో ప్రమాదంలో గాయపడ్డాడు. అతన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రాగిపాటి బాల చెన్నయ్య కుటుంబ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మన ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *