గోల్డ్ ఆఫ‌ర్ చేసిన సోమిరెడ్డి

సీఎం అపాయింట్‌మెంట్ కావాల‌ని ఓ ప్ర‌ముఖుడు అడిగితే

అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని కాణిపాకంలో ప్ర‌యాణం చేయి

సోమిరెడ్డికి కాకాణి ఛాలెంజ్‌

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్య‌క్షులు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. తాను అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా..? స‌వాల్ విసిరారు. కాణిపాకం వద్ద ప్రమాణం చేయ‌మని రెండు వారాలు క్రితం సోమిరెడ్డికి ఛాలెంజ్ చేశానని.. ఇంతవరకు స్పందించక‌పోవ‌డం సిగ్గుచేట‌న్నారు. అస‌లు సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయట పెడితే.. అన్నీ విషయాలు బయటడతాయని చుర‌క‌లంటించారు. కాణిపాకంలో ప్రమాణం చెయ్యమని చంద్రబాబైనా సోమిరెడ్డికి చెప్పాలని ఎద్దేవా చేశారు. సీఎం దగ్గర అపాయింట్మెంట్ కావాలని ఓ ప్రముఖుడు అడిగితె.. ఆయ‌న గోల్డ్ ఆఫర్ చేశారట అని త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *