- దాడిపై మంత్రి దృష్టికి తీసుకెళ్తా-కోటంరెడ్డి
- దాడి దురదృష్టకరం- అబ్ధుల్ అజీజ్
నెల్లూరు వెంకటేశ్వరపురం.. భగత్‌సింగ్ కాలనీవద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వర్గాలు.. వర్గ పోరుతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో.. తీవ్రంగా గాయపడి.. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు 53, 54 డివిజన్ల క్లస్టర్ ఇన్‌ఛార్జి జహీర్‌ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్ధుల్ అజీజ్, ఇతర టీడీపీ నాయకులు పరామర్శించారు. దాడికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటంరెడ్డి, అజీజ్‌లు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ క్రమశిక్షణగల పార్టీ అని.. టీడీపీలో ఇటువంటి ఘటనలు గతంలో జరగలేదని.. ఈ ఘటనపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని ఈసందర్భంగా కోటంరెడ్డి పేర్కొన్నారు. అలాగే.. ఇటువంటి ఘటనలు దురదృష్టకరమని అజీజ్ తెలియజేశారు.