- ఏంది…నువ్వొచ్చి పీకేది
- హౌస్ అరెస్ట్ అని…ఓ సీన్ క్రియేట్ చేశావ్
- రైతుల జోలికి వస్తే ఊరుకోను
- మాజీ మంత్రి కాకాణికి ఎమ్మెల్యే సోమిరెడ్డి వార్నింగ్
ఏంది నువ్వొచ్చి పీకేది…రైతుల జోలికి వస్తావా నువ్వు…దమ్ముందా నీకు…అంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి…సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడకి వచ్చేందుకు నీకు దమ్ములేక…హౌస్ అరెస్ట్ అని…పెద్ద సీన్ క్రియేట్ చేశావని కాకాణి హౌస్ అరెస్ట్ పై సెటైర్లు వేశారు. నీకు రైతులందరూ తాట తీస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో సోమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.