- కలెక్టర్ గారు…మీరైనా న్యాయం చేయండి
- పొదలకూరు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట షాప్ లైసెన్స్ హోల్డర్ మీడియా సమావేశం
పొదలకూరు ఎక్సైజ్ సీఐ తమ మద్యం షాపుకు సంబంధించిన పర్మినెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని… మద్యం షాపు లైసెన్స్ హోల్డర్ కడియాల లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. పొదలకూరులోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.