- నలుగురికి గాయాలు
- కొడవలూరు హైవేపై యాక్సిడెంట్
రెండు కార్లు ఢీకొని…నలుగురికి గాయాలైన సంఘటన… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖర పురం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు…ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రెండు కార్లు ఢీకొన్నట్లు స్థానికులు వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.