- గృహ నిర్భంధించిన పోలీసులు
- కాకాణి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం
- మాజీ మంత్రి నివాసం ఉద్రిక్తత
- పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమిరెడ్డి అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులతో కలిసి కనుపూరు కాలువకు బయలుదేరిన కాకాణిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకాణి నివాసానికి భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాకాణిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ విఫల యత్నం చేసి, చివరకు హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసులపై కాకాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము సోమిరెడ్డిని అడ్డుకొని ఉంటే, అల్లీపురం నుండి కూడా బయటకు రాలేకపోయేవాడని ఘాటుగా విమర్‌శించారు. సోమిరెడ్డి అవినీతిపై పోరాటం కొనసాగుతుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాకాణి తేల్చి చెప్పారు.