కోవూరులో వైభవంగా నాగుల చవితి వేడుకలు
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు NTS గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నాగుల పుట్టలో పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నాగుల పుట్టకు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉందని భక్తులు తెలిపారు. రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉండడంతో ఇక్కడ గ్రామస్తులు వాటికి పాలు పోసి పూజలు చేసే వాళ్ళని అప్పటినుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే వాళ్ళని కోరిన కోరికలు తీర్చే నాగుల పుట్టగా దీన్ని నమ్ముతారని భక్తులు అన్నారు.