నాగుల పుట్టలకు భక్తులు విశేష పూజలు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో నాగుల చవితి పండుగను భక్తులు వైభవంగా నిర్వహించారు. మండలంలోని నాగులమ్మ పుట్టలకు భక్తులు పుట్ట చుట్టూ దారం చుట్టి…పాలు పోసి…నైవేధ్యాలు సమర్పించి దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నాగుల చవితి విశిష్ఠతను…గిరిధర్ స్వామి, సత్య కృష్ణ స్వామి, మురళీకృష్ణ స్వామి మీడియా ద్వారా తెలియజేశారు.