- సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలతో దగ్గరుండి పనులను చేపట్టిన 5వ డివిజన్ ఇన్‌చార్జ్ పనబాక గంగరాజు
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ హరిజనవాడలోని స్మశానవాటిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టికి హరిజనవాడలోని స్మశానవాటికలో నెలకొన్న దుస్థితిని 5వ డివిజన్ ఇన్‌చార్జ్ పనబాక గంగరాజు తెలియజేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే నెలవల మున్సిపల్ కమిషనర్‌ను క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో 5వ డివిజన్ ఇన్‌చార్జ్ పనబాక గంగరాజు ఆధ్వర్యంలో హరిజనవాడలోని స్మశానవాటికలో పేరుకుపోయి ఉన్న చెట్లను తొలగించి పరిశుభ్రత చేపట్టారు. దీంతో బిరదవాడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే విజయశ్రీకి ధన్యవాదాలు తెలియజేశారు.