- 18న మెట్ల పూజకు ఆహ్వానం
- సూళ్లూరుపేటలో 26వ వార్షికోత్సవ ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో షార్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతిల మెట్ల పూజ 26వ వార్షికోత్సవ ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా కరపత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కారంచేటి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ… గత 25 సంవత్సరాలుగా ప్రతియేట అత్యంత వైభవోపేతంగా జ్యోతుల గ్రామోత్సవం, శ్రీ స్వామివారి 18 మెట్ల పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే డిసెంబర్ 6వ తేదీ శ్రీ అయ్యప్ప స్వామి వారికి 26వ వార్షికోత్సవ జ్యోతుల గ్రామోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు.