- ముఖ్యమంత్రి, మంత్రులను గౌరవించండి
- మంచి కార్యక్రమం చేస్తే అభినందించాలి
- మాజీ మంత్రి కాకాణికి టీడీపీ నాయకుల హితవు
ఒక మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులను…ఏకవచనంతో సంభోదించడం తప్పు అని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు సొంత అవసరాలకు నారాయణ సార్ అని సంబంధించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నారాయణ అని ఏకవచనంతో సంభోదించడం సరికాదన్నారు. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అభినందించడం నేర్చుకోవాలని మల్లికార్జున యాదవ్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈపూరు మునిరెడ్డి, అక్కయ్యగారి ఏడుకొండలు, షేక్ షఫీఉల్లా, బొలిగర్ల శీను, సతీష్ తదితరులు ఉన్నారు.