ఊరిని సరిగా చూసుకోకపోతే.. చెక్ పవర్ రద్దు చేస్తాం చౌకచర్ల గ్రామ సర్పంచ్ అళగరి వినోద్‌కుమార్ కు వార్నింగ్ ఇచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి
గ్రామ అభివృద్ధికి సంబంధిత అధికారులను పంపిస్తాం.. అంతేకాదు.. నీ ఊరిలో నువ్వు మంచి చేసుకోవడానికి.. నీకు ఏం కావాలో చెప్పు.. చెస్తాం. నువ్వు వైఎస్ఆర్సీపీ సర్పంచా.. తెలుగుదేశం సర్పంచ్‌వా..? నాకు అనవసరం. ఒక ఊరికి సర్పంచ్ అంటే.. ఆ ఊరిలో ప్రజలను కాపాడ్డానికి ఉండేవాడు. సో.. నీ ఊరు.. నువ్ బాగు చేయడానికి ఏం కావాలో అవి మేం చేస్తాం.. ఊరినిగాని సరిగా చూసుకోకపోతే.. సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తాం అంటూ.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనదైన స్టైల్లో ఆ ఊరి సర్పంచ్‌ను హెచ్చరించారు. సమస్యలేమైనా ఉంటే.. పరిష్కరించుకోండి.. గ్రామంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే.. నాకు చెప్పి.. వాటిని సాల్వ్ చేసుకోండంటూ.. పంచాయితీ అధికారులకు ఆమె తనదైన శైలిలో ఆదేశించారు. ప్రశాంతిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలకు, అందర్నీ ఆదేశించిన తీరుకు ఆ గ్రామ ప్రజలంతా.. థట్ ఈజ్ ప్రశాంతిరెడ్డి అంటూ చర్చించుకోవడం విశేషం.