అత‌డికి..భూమ్మీద ఇంకా నూక‌లున్నాయ్‌..!

రైలు కింద ప‌డి చ‌నిపోవాల‌నుకున్నాడు
-మ‌హిళ‌లు చూసి కేక‌లేశారు.. యువ‌కులు కాపాడేశారు
-నెల్లూరు రైల్వే స్టేష‌న్‌లో ఘ‌ట‌న

అత‌డికి ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎంత ఇబ్బంది వ‌చ్చిందో.. ఎవ‌రేమైనా అన్నారో లేక ఆర్థిక ఇబ్బందులో.. ఇంకేమైనా కార‌ణ‌మోగాని.. రైలుకింద‌ప‌డి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడో వ్య‌క్తి. అత‌డెళ్లి రైలుకింద ప‌డ‌బోతే.. అక్క‌డే ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు కేక‌లు వేశారు. ఇంకొంద‌రు విద్యార్థులు అది గ‌మ‌నించారు. వెంట‌నే అత‌డ్ని కాపాడేశారు. అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.. క్ష‌ణాల్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నెల్లూరు సౌత్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం చోటుచేసుకుంది. ఆ వ్య‌క్తికి సుమారు 50 ఏళ్లుంటాయి. రైలుకింద త‌ల‌పెట్టి చ‌నిపోవాల‌నుకుని ఆ య‌త్నం చేశాడు. ఆయితే అత‌డికి ఈ భూమి మీద ఇంకా నూక‌లున్న‌ట్లున్నాయి. అక్క‌డే రైలు కోసం వేచి ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు కేక‌లు వేశారు.. కాపాడండి అంటూ ప‌రుగులు తీశారు. అది గ‌మనించిన కొంద‌రు విద్యార్థులు వెంట‌నే స్పందించి.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ఒడిగ‌ట్టిన అత‌డ్ని కాపాడారు. ఎందుకు చ‌నిపోవాల‌నుకుంటున్నార‌ని అక్క‌డి ఎంత అడిగినా.. అత‌డు స్పందించ‌కుండా వెళ్లిపోవ‌డం విశేషం. అత‌డి గురించి ఏ వివ‌రాలూ తెలియ‌రాలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *