ఆక్రమణను అడ్డుకున్న సెక్రటరీ, వీఆర్వో
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు పక్కన ఉన్న R&B స్థలంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రెటరీ చలపతి వీఆర్వో సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమణ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు.