మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ దారిలేదు
సచివాలయం ఎదుట మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన
ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి.. అయినా పట్టించుకోని అధికారులు, నేతలు
గూడూరు మండలం విందూరు గ్రామంలో మృతదేహంతో ఓ వృద్ధురాలు చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు శుక్రవారం కుటుంబ సభ్యులు నిర్ణయించారు. స్మశానానికి వెళ్లేందుకు మార్గం లేదు. గతంలో ఉన్న ఆ మార్గాన్ని కొందరు రాజకీయ నేతల పలుకుబడి ఉన్నవారు కబ్జా చేసేశారు. దాంతో ఆ గ్రామంలో ఎవరైనా మృతిచెందినా.. ఆ స్మశానంలో సంవత్సరికాలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవాలన్నా.. తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈవిషయమై గూడూరు అధికారులకు అనేకసార్లు విన్నవించినా.. ప్రజాప్రతినిధును కోరినా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ రోజు కూడా ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో.. వారంతా దారి చూపించండి అంటూ.. అక్కడి సచివాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో చర్చనీయాంశమైంది. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. అంత్యక్రియలు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆవేదనతో వేడుకుంటున్నారు. ఈ విషయంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, తిరుపతి కలెక్టర్, గూడూరు రెవెన్యూ అధికారులు స్పందించాలని.. వారంతా డిమాండ్ చేస్తున్నారు.