సంగంలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్

త‌హ‌సీల్దార్‌, విద్యుత్ కార్యాల‌యాల్లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాలలో అధికారులు 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు. అదే విధంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ శ్రీనివాసులు రెడ్డి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా దేశ నాయకుల చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కరెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *