సినీనటి అనసూయ చేతుల మీదుగా ప్రారంభం
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లిరాజు_ _పాల్గొన్న పలువురు రాకీయ ప్రముఖులు_
నెల్లూరులో… లక్కీ షాపింగ్ మాల్ 13వ స్టోర్
-సినీనటి అనసూయ చేతుల మీదుగా ప్రారంభం
-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లిరాజు
- పాల్గొన్న పలువురు రాకీయ ప్రముఖులు
దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్స్ లో ప్రత్యేక పేరు కలిగిన లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నెల్లూరులో అట్టహాసంగా జరిగింది. నెల్లూరు నగరం బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా…నాలుగు అంతస్తుల భారీ భవనంలో లక్కీ షాపింగ్ మాల్ 13వ స్టోర్ ను సినీ, రాజకీయ, పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి సినీనటి అనసూయ, బుల్లిరాజ్ రావడంతో వారిని చూసేందుకు జిల్లా ప్రజానికం పెద్ద ఎత్తున లక్కీ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం…నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులతో కలసి అనసూయ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్క్కతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.