ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు..

రవాణాకి సిద్ధంగా తెల్లరాయి.. -ప్రభుత్వ ఆదాయానికి గండి -సైదాపురం కుతరలింపు

ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు..
-రవాణాకి సిద్ధంగా తెల్లరాయి..
-ప్రభుత్వ ఆదాయానికి గండి
-సైదాపురం కుతరలింపు

కలువాయి మండలంలో ఆగని తెల్లరాయి తవ్వకాలు..యథేచ్ఛగా సాగుతున్నాయి .అక్రమ రవాణాకి తెల్లరాయి..సిద్ధంగా ఉంది .

నెల్లూరుజిల్లా, కలువాయి మండలం చీపినాపి గ్రామం నందు తెల్లరాయి గనులు ఎక్కువగా ఉన్నాయి..తెల్లరాయికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండటంతో.. కొందరు అనుమతులు లేకపోయినా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రి బయటకు తరలించేస్తున్నారు.. దీంతో గనులు కరిగిపోయి , ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తెల్లరాయిని సైదాపురం కి
తరలిస్తున్నారని, అక్కడినుంచి విదేశాలకు తరలి వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు… ఉన్నతాధికారులు అక్రమ తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *