రైతు అభివృద్దే ధ్యేయంగా పనిచేయండి

ఉద్యోగులకు బోనస్_ _చైర్మన్ కి సన్మానం_ _రైతు అభివృద్దే ధ్యేయం_ _చైర్మన్ మెట్టుకూరు ధనంజయ_

రైతు అభివృద్దే ధ్యేయంగా పనిచేయండి
-ఉద్యోగులకు బోనస్
-చైర్మన్ కి సన్మానం
-రైతు అభివృద్దే ధ్యేయం
చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రె

నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయిస్ అందరికి 15 రోజుల వేతనాన్ని మంజూరు చేసిన సందర్భంగా…గురువారం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ని సన్మానించారు.

గత సంవత్సరం సంబంధించి బ్యాంకు లాభాల బాటలో నడిచినందున ఎంప్లాయిస్ అందరికి 15 రోజులు వేతనం మంజూరు చేయడం జరిగిందని, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు బ్యాంకు చైర్మన్ మెట్టుకురు ధనంజయ రెడ్డి అన్నారు. ఎంప్లాయిస్ అందరు కష్టపడి ఈ సంవత్సరంలో కుడా సహాకార బ్యాంకుకు మరింత లాభాలు తీసుకొని రావాలని కోరారు. రైతు అభివృద్దే మన ధ్యేయంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ ,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర , జిల్లా నాయకులు..పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *