ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా_

ముస్లిం మైనార్టీల అభివృద్ధి ప్రత్యేక దృష్టి
-ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా

ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు 15శాతం తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాలులో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ముస్లింమైనార్టీలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న గృహనిర్మాణం, ఉపాధిహామీ, విద్య, సామాజిక పింఛన్లు, వైద్యం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, రుణాల మంజూరు మొదలైన ప్రాధాన్యత కార్యక్రమాలను ముస్లిం మైనార్టీలకు చేరువ చేయాలన్నారు. 15 శాతం తగ్గకుండా అందించేందుకు ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ అధికారి హైపా, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, డిఇవో బాలాజీరావు, డ్వామా పీడీ గంగాభవాని, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌వో ఖాదర్‌వలి, పరిశ్రమలశాఖ జిఎం మారుతీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *