నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తప్పవు
ఆత్మకూరులో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు
పలు దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు…
- నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తప్పవు
- ఆత్మకూరులో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో… రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం పర్యటించింది. మండలం, పట్టణంలోని… పలు మద్యం దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు మద్యం దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం అధికారులకు ఫిర్యాదులు చేశారు. మద్యం దుకాణాలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశాయా లేవా, కాలం చెల్లిన బీర్లు ఏమైనా అమ్ముతున్నారా అనే కోణంతో దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మద్యం దుకాణాలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా కాలం చెల్లిన బీర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.