కలెక్టర్ ఆనంద్_ _పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం_
పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి..
-కలెక్టర్ ఆనంద్
-పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం
పరిశ్రమలు ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మీటింగ్ జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 1700 దరఖాస్తులు రాగా అందులో 1616 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని… 20 దరఖాస్తులు తిరస్కరించగా 64 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రిజెక్ట్ అయిన దరఖాస్తులకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , నుడా శాఖలు తగు వివరాలను కలెక్టర్ కు తెలియజేశారన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయవలసిందిగా ఆయన సూచించారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం మారుతి ప్రసాద్, ఏపీఐఐసీ జెడ్. ఎం శివకుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారులు పావని, అనూష వంశీకృష్ణ, జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ మెంబర్ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.