సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి
అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్
జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలి…
-సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి
- అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్
- జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
తెలంగాణా రాష్ట్రంలో రైతుల పంటలకు సరిపడ యూరియా అందుబాటులో లేదని, వెంటనే అధికారులు యూరియాని అందుబాటులో ఉంచాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ధర్మ మీడియాతో మాట్లాడుతూ… రైతులు పంటలు వేసే సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. వెంటనే రైతులకి సబ్సిడీలో ఎరువులు, పనిమూట్లను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు వీరభద్రం, మండల కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.