లబోదిబోమన్న ఖాతాదారులు – సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు
SBI ఖాతాల్లో నగదు మాయం
-లబోదిబోమన్న ఖాతాదారులు
-సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు
నెల్లూరు జిల్లా, రాపూరు స్టేట్ బ్యాంకు ఖాతా దారుల అకౌంట్లలో నగదు మాయమై మైనస్ బ్యాలెన్స్ లు చూపించడంతో ఖాతాదారులు కంగుతున్నారు..బ్యాంకు మేనేజర్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఖాతాదారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
రాపూరు స్టేట్ బ్యాంకు ఖాతా దారుల అకౌంట్లలో నగదు మాయమవ్వడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 50 పైగా ఖాతాలలో నగదు మాయమైనట్లు గుర్తించారు. స్టేట్ బ్యాంకు మేనేజర్ దగ్గర కు వెళ్లి విషయం తెలపగా సైబర్ క్రైమ్ వాళ్లు మీ ఖాతాలను హోల్డ్ లో పెట్టారని సమాధానం ఇవ్వడంతో, రాపూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్సై ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు, చిరు వ్యాపారులు చేసుకొని జీవనం చేసుకునే మా ఖాతాలో అమౌంట్ మాయం అవడంతో మిరే మాకు న్యాయం చేయాలని ఎస్సై ని కోరారు..