30 న నిసార్ ఉపగ్రహం ప్రయోగం -అధునాతన పరిజ్ఞానంతో నిసార్
షార్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధం
-30 న నిసార్ ఉపగ్రహం ప్రయోగం
-అధునాతన పరిజ్ఞానంతో నిసార్
తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ నుండి ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు జి.ఎస్.ఎల్.వి – F16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి రాగం సిద్ధం చేస్తుంది.తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ నుండి ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు జి.ఎస్.ఎల్.వి – F16 రాకెట్ ద్వారా,. నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో-నాసా కలిసి సంయుక్తంగా రూపకల్పన చేశారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ నిసార్ ఉపగ్రహం ద్వారా విలువైన వాతావరణ సమాచారం అందుతుంది.