నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి_ _
రుస్తుం మైనింగ్ కేసులో బిరదవోలుని అరెస్ట్ చేసిన పోలీసులు_
వైసీపీ నేతకు 14 రోజులు రిమాండ్…
- నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి
- రుస్తుం మైనింగ్ కేసులో బిరదవోలుని అరెస్ట్ చేసిన పోలీసులు
రుస్తుం మైనింగ్ కేసులో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
రుస్తుం మైనింగ్ కేసులో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని సోమవారం హైదరబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. వైద్యశాల నుంచి గూడూరు మేజిస్ట్రేట్ ఎదుట శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం…
శ్రీకాంత్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అక్కడి నుంచి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు జిల్లా కేంద్ర కాగారానికి తరలించారు. నాతో బలవంతంగా సంతకాలు చేయించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నేను పెట్టనని చెప్పానని…కానీ పోలీసులు నన్ను చుట్టుముట్టి పెట్టించారన్నారు