రాకపోకలు ప్రారంభం -సిమెంట్ బ్లాక్ లు తొలగింపు -తొలగిన ట్రాఫిక్ కష్టాలు
రైల్వే గేటు వద్ద తొలగిన అడ్డంకులు..
-రాకపోకలు ప్రారంభం
-సిమెంట్ బ్లాక్ లు తొలగింపు
-తొలగిన ట్రాఫిక్ కష్టాలు
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట రైల్వేగేట్ వద్ద పొట్టిశ్రీరాములు వీధి మధ్యలో అడ్డంగా ఉన్నసిమెంట్ బ్లాక్ లను మంగళవారం పక్కకు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యలు తీరాయి
సూళ్లూరుపేట రైల్వేగేట్ వద్ద ఏంతో కాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య తీరింది . రైల్వే గేట్ వద్ద పొట్టిశ్రీరాములు వీధి మధ్యలో అడ్డంగా ఉన్న అండర్ బ్రిడ్జి కొరకు ఏర్పాటుచేసిన సిమెంట్ బ్లాక్ లను, మంగళవారం ప్రక్కకు 4 మీటర్ల మేర జరిపేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం ప్రారంభమైన పనులు సాయంత్రానికి పూర్తి కావడంతో రైల్వే గేటు వద్ద రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. . సుదీర్ఘకాలంగా ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందిగా మారిన సమస్యకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవడం కోసం స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు,