పోలీసింగ్ స్కిల్స్ పెంచుకోవాలి_ _అర్ధ-వార్షిక నేర సమీక్షలో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు_
ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలి
- పోలీసింగ్ స్కిల్స్ పెంచుకోవాలి
- అర్ధ – వార్షిక నేర సమీక్షలో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు
ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా వుండాలని, జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా పని చేయాలని పోలీసు అధికారులకి ఎస్పీ వీఎస్ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్ధ-వార్షిక నేర సమీక్షా కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. సమీక్షలో జిల్లా పోలీసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వారికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పోలీసు శాఖ సమన్వయాన్ని ప్రస్తావిస్తూ, క్రైమ్ నిరోధన, దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో ఇతర ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.