నెల్లూరులో రెచ్చిపోతున్న దొంగలు_ _మనుమసిద్ధి నగర్‌లో మిట్టమధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ_ _ఇంటి తలుపులు పగలగొట్టి.. 32 సవర్ల బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన దుండగులు_ _ఆలస్యంగా వెలుగులోకి.. సీసీ ఫుటేజీలో చోరీ తీరు_ _ఆ దొంగలు తిరుపతిలో పట్టుబడ్డట్టు సమాచారం_
పట్టపగలే బరితెగిస్తున్నారు..!
-నెల్లూరులో రెచ్చిపోతున్న దొంగలు
-మనుమసిద్ధి నగర్‌లో మిట్టమధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ
-ఇంటి తలుపులు పగలగొట్టి.. 32 సవర్ల బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన దుండగులు
-ఆలస్యంగా వెలుగులోకి.. సీసీ ఫుటేజీలో చోరీ తీరు
ఆ దొంగలు తిరుపతిలో పట్టుబడ్డట్టు సమాచారం
నెల్లూరు పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు.. రాత్రి తేడా లేకుండా.. చోరీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా.. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నా.. రెక్కీ చేసి మరీ.. చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. పట్టపగలే ఓ ఇంటిని కొల్లగొట్టి.. విలువైన బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాలమేరకు.. నెల్లూరు మనుమసిద్ధి నగర్‌లో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నాం కొందరు దొంగులు పడ్డారు. ఆ ఇంట్లో ఎవరూ లేనిది గమనించి.. ముందుగానే రెక్కీ నిర్వహించి.. ఆ ఇంటిని దోచేకున్నారు. ఇద్దరు దొంగలు బయట ఉండి.. మరో ఇద్దరు దొంగలు నక్కి నక్కి ఆ ఇంట్లోకి జొరబడి. తలుపులను పగలగొట్టి.. చోరీకి పాల్పడ్డారు. బీరువాల్లో దాచిన 32 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు కొంత నగదును కూడా దోచుకెళ్లారు. ఈ చోరీ వ్యవహారం అంతా.. ఆ ఇంట్లో ఏర్పాటుచేసిన సీపీ ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. ఆ ఇంటి యజమానులు పక్కరోజు వచ్చి చూసే సరికి తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంట్లో ఏర్పాటుచేసిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆ దొంగల వివరాలను అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపారు. ఇయితే.. 21వ తేదీ.. వారు తిరుపతిలో పట్టుబడ్డట్టు తెలిసింది. నేరాల నియంత్రణపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటిష్టమైన చర్యలు, డ్రోన్లతో నిఘా, ఇతర చర్యలు చేపడుతున్నా.. స్టేషన్‌ల వారీగా ఉన్న నిఘా టీం, బ్లూకోట్స్, గస్తీ టీమ్‌ల విఫలంతోనే చోరీలు, దోపిడీలు జరుగుతున్నాయంటున్నారు. అలాగే.. చోరీలకు పాల్పడే వారి కదలికలు, జైలుకు వెళ్లి వచ్చిన వారిపై సరైన నిఘా లేనేలేదు. ఇటువంటి వరుస సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది