డిజిటల్ క్లాస్ రూమ్ ని ప్రారంభించిన మంచు
నాయుడుపేటలో సందడి చేసిన మంచు లక్ష్మి….
-డిజిటల్ క్లాస్ రూమ్ ని ప్రారంభించిన మంచు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సిటీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాల పురం ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని లక్ష్యంతో డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నాయుడుపేటలోని తన తల్లి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు 786 రఫీ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.