గుడిలో చోరీ చేశారు – గ్రామస్థులకి దొరికిపోయారు
టైం…బ్యాడ్
- గుడిలో చోరీ చేశారు
- గ్రామస్థులకి దొరికిపోయారు
నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామంలో గంగమ్మ ఆలయంలో సోమవారం రాత్రి నలుగురు యువకులు చోరీకి యత్నించారు. నలుగురు యువకులు అమ్మవారి హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు అపహరించే ప్రయత్నం చేశారు. గుర్తించిన గ్రామస్తులు ఆ నలుగురిని వెంబడించగా ముగ్గురుని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుకున్న ఆముగ్గురిని గ్రామస్తులు చితకబాది లింగసముద్రం పోలీసులకు అప్పగించారు.