చంద్రబాబుకు మోసం చేయడం పరిపాటి

మేకపాటి రాజగోపాల్ రెడ్డి -అబద్దపు హామీలతో గద్దెనెక్కారు

చంద్రబాబుకు మోసం చేయడం పరిపాటి …
-మేకపాటి రాజగోపాల్ రెడ్డి
-అబద్దపు హామీలతో గద్దెనెక్కారు

అధికారం లోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని , ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. వింజమూరు లోని ఓ కల్యాణ మండపం లో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.

ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు లోని ఓ కల్యాణ మండపంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ ..మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ నాయకులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు కు ప్రజలను మోసం చేయడం పరిపాటి అని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ స్థాయి నాయుకులు,మండల నాయుకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *