షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి భరత్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు…
- షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి భరత్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలసి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థితిగతులను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మంత్రికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించేందుకు నిర్ణయించిందని ఆమె వివరించారు. ఈ మేరకు ఫ్యాక్టరీ స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగించి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనలకు కృషి చేయాలని ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల స్థాపనతో కోవూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆమె ఆకాంక్షించారు. ప్రశాంతిరెడ్డి విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా స్థానికంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.