_రాపూరులో సుపరిపాలనలో తొలి అడుగు_
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు
- రాపూరులో సుపరిపాలనలో తొలి అడుగు
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో -తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ఆదురుపల్లి, తుమాయి పంచాయతీలో కార్యకర్తలతో కలసి ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, ఆగస్టు15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, నరేష్ నాయుడు, జూపల్లి ప్రకాష్ నాయుడు, మతకాల వసంత కుమార్, తూమాటి పెంచలయ్య టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.