వేగంగా భవన నిర్మాణ పనులు_ _మూడేళ్ళలో నిర్మాణాలు పూర్తి ..మంత్రి_
సీఆర్డీఏ ఇంజినీర్లతో కలసి అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ
-వేగంగా భవన నిర్మాణ పనులు
-మూడేళ్ళలో నిర్మాణాలు పూర్తి ..మంత్రి
అమరావతిలో మంత్రి నారాయణ , సీఆర్డీయే ఇంజనీర్లతో కలిసి పర్యటించారు, నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించారు.
అమరావతి లో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. సీఆర్డీఏ ఇంజనీర్లతో కలసి అయన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు,అధికారుల కోసం 4000 ఇళ్లను కేటాయించి నిర్మాణాలు ప్రారంభించామన్నారు. పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90 శాతం ఉందని ,మెషినరీ ఈనెలాఖరుకు పూర్తిగా వస్తుందన్నారు.
ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు,ఏఐఎస్ అధికారులు,సెక్రటరీలు,మంత్రులు,జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయని, మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. .అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
రాజధానిలో ఇప్పటివరకూ మొత్తం 72 సంస్థలకు భూములు కేటాయించామని ఈ సందర్బంగా అయన తెలిపారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.