రాపూరు మద్యం దుకాణంలో చోరీ..!
నెల్లూరు జిల్లా.. రాపూరు మద్యం దుకాణంలో చోరీ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
మద్యం దుకాణంలో పనిచేస్తున్న క్యాషియర్ వివరాల మేరకు.. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత షాప్ క్లోజ్ చేసి అంతా వెళ్లిపోయామని.. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూస్తే.. తాళాలు పగలు గొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు మద్యం కేసులు, కొంత నగదు చోరీ అయిందని తెలిపారు. సమాచారం అందుకున్న రాపూరు పోలీసులు విచారణ చేపడుతున్నారు.