ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై వివరించిన మంత్రి ఆనం
పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు…
- ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై వివరించిన మంత్రి ఆనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి ఆనం తెలిపారు. పాణ్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షే పథకాలను ప్రజలకు తెలియజేశారు.
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యురాలు గౌరు చరితతో కలిసి దుర్వేసి గ్రామంలో మంత్రి పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సూపర్ సిక్స్ పథకాల లబ్ధిదారుల తో మంత్రి ఆనం, ఎమ్మెల్యే గౌరు చరిత, స్థానిక ప్రజాప్రతినిధులతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. గడపగడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు, సమస్యలు మంత్రి, ఎమ్మెల్యే తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి ఆనం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.